రాయదుర్గం: బొమ్మనహాల్‌లో బొమ్మ/బొరుసు జూదంపై పోలీసు దాడి - 18 మంది అరెస్టు
బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాల్ గ్రామ శివారులో జూద స్థావరంపై పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం ఎస్ఐ నబీరసూల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో బొమ్మ/బొరుసు జూదం ఆడుతున్న 18 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 22,500 నగదు, 52 పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట, మట్కా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.