నాంపల్లి: 30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి: కాంట్రాక్టు అధ్యాపకులు
30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం కోఠిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు తమ క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవంతో ఉన్న తమను కొత్త నియామకాలమందు క్రమబద్ధీకరించాలని కోరారు. లేనియెడల తరగతులను బహిష్కరించి ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.