విశాఖపట్నం: సుజాతనగర్ మద్యం షాపుపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరిక
విశాఖపట్నం సుజాతనగర్ 80 ఫీట్ల రోడ్డులోని మద్యం దుకాణాన్ని వారం రోజుల్లోగా తొలగించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. ప్రజల నిరసనలకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే, అధికారులు స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.