రాయదుర్గం: నాగిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన యువరైతు విద్యుత్ షాక్ కు గురై మృతి
విద్యుత్ షాక్ కు గురై యువ రైతు మృతి చెందిన సంఘటన రాయదుర్గం మండలంలోని నాగిరెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు పొలాలకు వెళ్లే దారిలో రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ వైరు తెగి కిందపడింది. పురుషోత్తం అనే రైతు శనివారం ఉదయం పొలానికి వెళుతూ ప్రమాదవశాత్తు ఆ వైరు కాలుకు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.