కొండపి: జరుగుమల్లి మండలంలో తీవ్ర విషాదం, అనారోగ్యంతో మాజీ ఎంపీపీ విజయనిర్మల మృతి, సంతాపం ప్రకటించిన నేతలు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం మాజీ ఎంపీపీ ప్రస్తుత ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ విజయనిర్మల గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. పలువురు నాయకులు నిర్మల మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తమ సేవలు వెలకట్టలేనివి అని పలువురు నాయకులు ఆమెను కొనియాడారు. కుటుంబ సభ్యులు ఈరోజు లేదా రేపు విజయ నిర్మలకు అంత్యక్రియలు పూర్తి చేస్తామని తెలిపారు.