మార్కాపురం: జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ గా సువార్త బాధ్యతల స్వీకరణ
మార్కాపురం జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్గా సువార్తమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆమెను ఎంపీడీవో బాల చెన్నయ్య, కార్యాలయం సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చమిచ్చి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.