యర్రగొండపాలెం: వైపాలెం లో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో అంగరంగ వైభవంగా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి అన్న క్యాంటీన్ ప్రారంభించారు. అనంతరం వారి స్వయంగా భోజనం వడ్డించి భోజనం రుచి చూశారు. అన్నా క్యాంటీన్ పేదలకు వరమని అది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు.