రాయదుర్గం: హనకనహల్ లో యువకుల మద్య ఘర్షణ, పలువురికి గాయాలు
కణేకల్లు మండలం హనకనహల్‌లో రెండు రోజులక్రితం పీర్ల పండుగ రోజు యువకుల మధ్య జరిగిన చిన్న గొడవ ముదిరింది. పోలీసులు, గ్రామస్తుల వివరాల మేరకు బెళుగుప్పకు వెళ్తున్న వంశీ, సిద్ధార్థలను శనివారం సాయంత్రం కురుబ వన్నూరుస్వామి కొడుకులు అడ్డగించి గొడవపడ్డారు. ఇరువర్గాల బంధువుల జోక్యంతో మాటామాటా పెరిగి శనివారం రాత్రి దాడులు జరిగాయి. ఒక వర్గానికి చెందిన వంశీ, సిద్ధార్థ, బసవరాజు, వన్నూరస్వామితో పాటు మరో వర్గంంలో ఇద్దరు యువకులు గాయపడటంతో వీరిందరినీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇందులో సిద్ధార్థ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.