డిచ్పల్లి: డిచ్పల్లి 7వ బెటాలియన్లో ఘనంగా విజయదశమి వేడుకలు
డిచ్పల్లిలోని 7వ బెటాలియన్ తెలంగాణ ప్రాంగణంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా వాహన, ఆయుధ పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ బి. సీతారాం, అసిస్టెంట్ కమాండెంట్ డి. శ్రీనివాసరావు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.