నిజామాబాద్ రూరల్: నిజామాబాద్: గ్రూప్-1లో డిఎస్పీగా ఎంపికైన నిఖిల రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే
నిజామాబాద్ కార్పొరేషన్ గంగస్థాన్-2కు చెందిన గౌరోల్లా నిఖిల రెడ్డి గ్రూప్-1 పరీక్షలో డిఎస్పీగా ఎంపికయ్యారు. ఈ విజయం సాధించిన నిఖిలను ఎమ్మెల్యే డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించి అభినందించారు.