గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాన్ని గురువారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచేందుకు ఉపాధ్యాయులు పనిచేయాలని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యావ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలిపారు. అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదవడం వల్ల ప్రయోజనాలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రస్తావించారు.