రాయదుర్గం: దేశవ్యాప్తంగా మెడికల్ షాపు లు బంద్, ఆన్ లైన్ విక్రయాలపై నిరసన
ఆన్ లైన్ లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలు నివారించాలని, కార్పోరేట్ సంస్థల అధిక డిస్కౌంట్ లు ఆపాలంటూ రాయదుర్గంలో మెడికల్ షాపులు బంద్ చేశారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆర్గనైజేషన్ పిలుపులో బాగంగా బుధవారం స్వచ్చందంగా షాపులు మూసేసి నిరసన చేపట్టినట్లు స్థానిక అధ్యక్ష, కార్యదర్శులు జయంతి సుబ్రహ్మణ్యం, ఆనంద్ తెలిపారు. వినాయక కూడలి నుంచి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఆయూబ్ ఖాన్, స్వామి కుమార్, విష్ణు, ముత్తీవర్ రెహమాన్, సత్యనారాయణ, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.