పోలవరం: పోలవరం ప్రాజెక్టు వద్ద కనిపించిన మొసలి
పోలవరం ప్రాజెక్టు వద్ద దిగువ కాఫర్ డ్యామ్ సమీపంలో మొసలి కనిపించింది. లారీ డ్రైవర్ల అలజడితో అది తిరిగి గోదావరిలోకి వెళ్లిపోయింది. పాపికొండల పరిధిలో గోదావరిలో మొసళ్ల ఉనికిని ఇప్పటికే అటవీశాఖ గుర్తించినట్లు వెల్లడించింది.