రాయదుర్గం: జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యా వ్యవస్థను బ్రస్టు పట్టించారు : ప్రభుత్వవిప్ కాలవశ్రీనివాసులు
గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఐదేళ్లలో విద్యా ప్రమాణాలు అటకెక్కాయని ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆరోపించారు. గురువారం మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్రస్టు పట్టించిన విద్యా విధానాన్ని తిరిగి గాడిలో పెట్టామన్నారు. గత రెండేళ్లలో విద్య శాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు మంచి పలితాలు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. ఇందుకు నేడు విడుదలైన టెన్త్ పలితాలే నిదర్శనమన్నారు. తల్లికి వందనం ద్వారా 15 వేలు అందజేయడంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగిందని వివరించారు.