మార్కాపురం: జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ వద్ద పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన తెలిపిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం గడియారం స్తంభం సెంటర్ వద్ద దివాంగనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాంబాబు మాట్లాడుతూ 2014 ఎన్నికల ముందు ఎలాంటి ధరలు పెంచమని చెప్పిన మాటను గుర్తు చేశారు. ఇప్పుడు ధరలు పెంచి సామాన్యుడిని తీవ్ర ఇబ్బందులకు నెట్టివేశారన్నారు.