గిద్దలూరు: కొమరోలు పట్టణంలోని ఇస్లాం పేటకు చెందిన నాగూర్ వలి మృతి, ఈనెల 18వ తేదీన ఇంటి నుంచి అదృశ్యమైన వృద్ధుడు
మార్కాపురం జిల్లా కొమరోలు పట్టణంలోని ఇస్లాం పేటకు చెందిన నాగూర్ వలి మండలంలోని సూరవారి పల్లి గ్రామం వద్ద మృతి చెంది కనిపించాడు. ఈనెల 18వ తేదీ నుంచి కనిపించకుండా అదృశ్యమైన నాగూర్ వలి మృతి చెందినట్లుగా ఎస్ఐ నాగరాజు తెలిపారు. మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్లిపోయిన నాగూర్ వలి మృతి చెందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విచారణలో మరిన్ని వివరాలు తెలియవలసి ఉందని అన్నారు.