రాయదుర్గం: దర్గాహొన్నూర్ వద్ద 17 మంది బెట్టింగ్ బ్యాచ్ ను అరెస్టు చేసిన పోలీసులు
బొమ్మనహాల్ మండలం, ధర్గాహొన్నూరు శివారులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 17 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.1.34 లక్షల నగదు 17 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. మంగళవారం సాయంత్రం పక్కా సమాచారంతో ఎస్ఐ నబీరసూల్, పోలీస్ సిబ్బంది ధర్గా సమీపంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు, బెట్టింగ్ ఉచ్చులో పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సిఐ హెచ్చరించినారు.