గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పూసలపాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ద్విచక్ర వాహనదారుడు మృతి
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో మొహరం పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. పూసలపాడు గ్రామంలో మొహరం పండుగ వేడుకలలో పాల్గొని బేస్తవారిపేటకు వెళ్తున్న మోత్కూరి సుధాకర్ ని మినీ లారీ ఢీకొట్టడం తో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. లారీ ఢీకొట్టిన తీవ్రతకు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ వాహనం మంటల్లో దగ్ధమైంది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ సంఘటనా స్థలంలో లారీని విడిచిపెట్టి పరారయ్యాడు. జరిగిన ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. మృతి చెందిన సుధాకర్ భార్య మూడు నెలల గర్భిణీగా బంధువులు చెబుతూ బోరున విలపించారు.