కొండపి: ఐటిసి కేంద్ర ప్రభుత్వం కలిసి పొగాకు ధరలు తగ్గించాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాబు
పొగాకు సమస్యను ఐటీసీ కేంద్ర ప్రభుత్వం కలిసి ధరల విషయంలో సంక్షోభం సృష్టించిందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. కె. మాబు అన్నారు.సోమవారం ప్రకాశం జిల్లా కొండపిలో వేలం కేంద్రం దగ్గర రైతులతో కలిపి నిరసన చేశారు. ఎగుమతులు లేవని చెప్తున్న ఐటీసీ కంపెనీకి గత ఏడాది రూ. వేల కోట్లు లాభం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏడు శాతం షేర్ విలువ సైతం పెరిగిందని, రైతులకు నష్టాలొస్తే కంపెనీలకు లాభాలు ఎలా వస్తాయన్నారు.