కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలోని మారంపల్లి కాలనీలో బోరు ఏర్పాటు చేయించి తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సురేంద్రబాబు
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని మారంపల్లి కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. కాలనీవాసులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే స్పందించారు. సోమవారం రాత్రి బోరు ఏర్పాటు చేయించారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బోరు ఏర్పాటు చేశారు. సుమారు రెండు ఇంచులు నీళ్లు పడ్డాయి. దీంతో కాలనీలో తాగునీటి సమస్య తీరింది. కాలనీవాసులు ఎమ్మెల్యే సురేంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.