దర్శి: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చిన దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 20, 2026 ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు బడి పిలుస్తుంది కార్యక్రమం చేపట్టినట్లు టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు విద్యార్థులకు అవసరమైన అన్ని ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చక్కటి విద్య బోధన అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ఆలోచించి ప్రభుత్వ పాఠశాలకు పంపాలని పిలుపునిచ్చారు.