దర్శి: మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు రోడ్డుకు ఇరువైపులా పెరుగుతున్న పిచ్చి మొక్కలను తొలగించిన పోలీసులు
Darsi, Prakasam | May 17, 2026 మార్కాపురం జిల్లాలో రోడ్డు ప్రమాదల నివారణకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా పెరుగుతున్న పిచ్చి మొక్కలను ప్రమాదాల నివారణకు పోలీసులు జెసిబి సహాయంతో తొలగించారు. ఇటీవల జిల్లాలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పిచ్చి మొక్కలు తొలగించామని స్థానిక ప్రజలు కూడా అందుకు సహకరించడం అభినందనీయమని పోలీసులు తెలిపారు.