ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ మండలం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు మంత్రికి తీర్థప్రసాదాలు వినియోగం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని స్థానిక అధికారులు, ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు.