కొండపి: టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాసనాలు వేసిన విద్యార్థులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సెక్టార్ 3లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్రంకువచ్చేపిల్లలచే యోగాసనాలు వేయించారు. అంగన్వాడీ కార్యకర్త కళ్యాణి మాట్లాడుతూ పిల్లలకు చిన్న వయసు నుండే యోగాసనాలు వేయించడంతో వారి భవిష్యత్తు జీవనశైలిలో శరీర దృఢత్వంతో ఎంతోఆరోగ్యంగా ఉంటారన్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం చేపించి నందుకు పిల్లల తల్లిదండ్రులు ఐసిడిఎస్ అధికారులు ప్రశంసిస్తున్నారు.