కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దిగువమెట్ట ఎరుకల కాలనీలో నిర్వర్గాలు ఘర్షణ, నలుగురికి గాయాలు ఆసుపత్రికి తరలింపు
ప్రకాశం జిల్లాలోని దిగువమెట్ట ఎరుకల కాలనీలో 500 రూపాయల నగదు లావాదేవీల విషయంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఘటనలో ఇరు వర్గాలకు చెందిన నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని స్థానిక గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.