కొండపి: కొండపి, సింగారాయకొండ పొగాకు రైతుల ఆవేదన, జిఎస్టి ధరలతో పొగాకు ధరలు తగ్గిపోయాయని చెబుతున్న రైతులు
ప్రకాశం జిల్లా కొండపి సింగరాయకొండ పొగాకు రైతులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల తొమ్మిదో తేదీ నుంచి పొగాకు కొనుగోలు ప్రారంభమైన సరైన ధరలు లేక నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. అంతేకాకుండా అత్యధికంగా పొగాకు బెల్లు తిరస్కరణకు గురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మరొకసారి ఆలోచించి పొగాకు రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.