కొండపి: టంగుటూరు మండలం తూర్పు రాయుడుపాలెం లోని మంత్రి కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి స్వామి ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఇచ్చిన అర్జీలు అన్నిటినీ పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతగా పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. కొండపి నియోజకవర్గం అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించడంతోపాటు తన బాధ్యతగా పనిచేస్తానన్నారు.