మార్కాపురం: జిల్లా కేంద్రంలో రహస్యంగా దాచి ఉంచిన గోవులను పట్టుకున్న పోలీసులు హిందూ సంఘాల నాయకులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో రహస్యంగా దాచి ఉంచిన ఆవులను హిందూ సంఘ నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణారావు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సుమారు 65 గోవులను రక్షించినట్లు కృష్ణారావు తెలిపారు. వాటిలో కొన్నిటిని కోసి మాంసాన్ని విక్రయించినట్లు తెలిపారు. గోమాతగా పూజిస్తున్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఈ విధంగా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు