రాయదుర్గం: పట్టణంలో ఉత్సాహంగా కబడ్డీ పోటీలు, ప్రారంభించిన మంత్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలవశ్రీనివాసులు అస్మిత్ రెడ్డి
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. కాలవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా రాత్రి వేళ ప్లడ్ లైట్ల వెలుగులో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి మంత్రి జనార్ధన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలవశ్రీనివాసులు అస్మిత్ రెడ్డి, దగ్గుబాటి ప్రసాద్, కాలవ ఫౌండేషన్ చైర్మన్ కాలవ భరత్ లు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి పోటీలు ప్రారంభించారు. రసవత్తరంగా జరుగుతున్న ఈ పోటీలు తిలకించేందుకు క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.