మార్కాపురం: మార్కాపురం మున్సిపాలిటీ వార్డుల పెంపు ముసాయిదా పై అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం మున్సిపాలిటీలో వార్డుల పెంపు ముసాయిదాపై వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, మున్సిపల్ కమిషనర్ నారాయణరావుకు వినతి పత్రం అందజేశారు. రాంబాబు మాట్లాడుతూ... 2011, 2025 ఓటర్ల లిస్టు ప్రకారం న్యాయబద్ధంగా 40 వార్డులుగా విభజించాలన్నారు. అలా చేయకుండా కేవలం కొందరికి లబ్ధి చేకూరే విధంగా వార్డుల విభజన ఉంది అన్నారు.