మార్కాపురం: మార్కాపురంలో ప్రతి సోమవారం జరిగే పరిష్కార వేదిక కార్యక్రమం సమయం మార్పులు చేసినట్లు కలెక్టర్ విజయ సునీత వెల్లడి
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కాపురం కలెక్టర్ విజయ సునీత ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయాలు మార్పులు చేసినట్లు మీడియాకు శనివారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే మార్కాపురం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని సమయాల మార్పులను ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ అన్నారు.