రాయదుర్గం: రాతిబావివంక గ్రామంలో ఈదురు గాలుల వర్షానికి నేలమట్టమైన బొప్పాయి తోట
ఏడాది పాటు బంగారం కొనవద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ వాఖ్యలపై స్వర్ణకారులు, జువెలరీ షాప్ యజమానులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గోల్డ్ షాపులు బంద్ చేసి నిరసనలు చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో స్వర్ణకారులు, గోల్డ్ షాపు యజమానులు తమ షాపులు బంద్ చేసి నిరసన ర్యాలీ చేపట్టారు. వినాయక కూడలిలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రధాని మోడీ వాఖ్యలను నిరసించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అసోషియేషన్ నాయకులు గోల్డ్ ఘని, కంసల నాగరాజు, ఆరుణ్ బాష, ఇబ్రహీం, ఇస్మాయిల్, ఓంకారాచారి స్వర్ణ కారులు పాల్గొన్నారు.