మార్కాపురం: నేషనల్ ప్రిస్టేజ్ అవార్డు అందుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ చైర్మన్ మహబూబ్ బాషా
మార్కాపురం పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ సెల్ చైర్మన్ మహబూబ్ బాషా నేషనల్ ప్రిస్టేజ్ అవార్డు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం లో మహబూబా వలికి అవార్డును అందజేశారు. ఇప్పటివరకు 114 అవార్డులు అందుకున్న ఆయన 115వ అవార్డు రావడం ఆనందంగా ఉంది అన్నారు. ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా రంగం రాజకీయ రంగాలలో చురుకుగా పాల్గొంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. భారత సైన్యంలో 20 సంవత్సరాలు పైగా దేశం కోసం విశేష సేవలందించామన్నారు.