యర్రగొండపాలెం: పిల్లల కోసమే సర్వేరెడ్డిపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు: మార్కాపురం డిఎస్పి నాగరాజు
పిల్లలు తన వద్దకు రావడం కోసమే సర్వేరెడ్డిపల్లి గ్రామంలో భార్య జ్యోతిని భర్త దావీదు గొడ్డలితో కిరాతకంగా హత్య చేసినట్లు విచారణలో గుర్తించామని మార్కాపురం డిఎస్పి నాగరాజు మీడియాకు తెలిపారు. 15 సంవత్సరాల క్రితం ఇరువురికి వివాహమైందని వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా భర్త ప్రవర్తన భాగలేక పోవడం వల్ల జ్యోతి తన పుట్టింటి వద్ద ఉంటుందని అప్పటినుంచి భర్త పిల్లల వద్దకు వస్తున్న ఆమె అడు ఉండడం వల్ల పథకం ప్రకారం గుంటూరులో గొడ్డలిని కొనుగోలు చేసి తీసుకువచ్చి ఆమెను హతమార్చినట్లు డిఎస్పి తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.