కొండపి: సింగరాయకొండ కొండపి పరిసర ప్రాంతాలలో అకాల వర్షాలు, ఉక్క పోతనుంచి ఉపశమనం పొందిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో శుక్రవారం పలుచోట్ల వర్షాలు కురిసాయి. గత రెండు రోజులనుంచి 43డిగ్రీల వేడి, ఎండ ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉదయం కురిసిన వర్షంతో కాస్త ఊరట లభించింది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం శుక్రువారం కురిసింది. ఈ వర్షంతో గ్రామాలల్లోని రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. సింగరాయకొండలో వర్షం వీడియో చూడవచ్చు.