రాయదుర్గం: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వేసవి దృష్ట్యా చలివేంద్రం ప్రారంభం
రాయదుర్గం పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బుధవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, యార్డు చైర్మన్ హనుమంతరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యార్డుకు వచ్చిన రైతులకు మెదటి రోజు మజ్జిగ, చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. రైతుల శ్రేయస్సు కోసం. మార్కెట్ యార్డ్‌లో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి టౌన్ ఇన్చార్జ్ టెంకశాల హనుమంతు, మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసులు, సూపర్వైజర్ రమేష్, జేఎంఎస్ ఓబులేష్, కావలి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.