కొండపి: మర్రిపూడి లో నిర్వహించిన ప్రత్యేక రెవిన్యూ గ్రీవెన్స్ లో పాల్గొన్న మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల కేంద్రంలో రెవిన్యూ సమస్యలపై ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి దూల బాల వీరాంజనేయ స్వామి పాల్గొని రైతుల వద్ద నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవిన్యూ సమస్యలను పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు.