యర్రగొండపాలెం: దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన ఉందని వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు
పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో వెలిసిన గొడ్రాలి కొండ తిరుమలనాథ స్వామి తిరుణాల సందర్భంగా వైసిపి పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఇలాంటి పరిపాలన ఎక్కడ లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తమ పాలనలో ఒక్క కొత్త పింఛన్, ఇండ్ల స్థలాలు గాని ఇండ్లు గాని ఇవ్వలేదన్నారు.