యర్రగొండపాలెం: దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యేలు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తపల్లి సమీపంలో వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించనున్నారు. జూన్ 27వ తేదీ సీఎం వస్తున్న సందర్భంగా సంబంధిత ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ తో కలిసి పరిశీలించారు. నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి అందజేస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు కట్టుతిట్టంగా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి ఎరిక్సన్ బాబు డీఎస్పీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.