మార్కాపురం: క్రికెట్ బెట్టింగులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఎస్సై సైదుబాబు
మార్కాపురం జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్ లో పట్ల యువతకు ఎస్సై సైదుబాబు అవగాహన కల్పించారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న నేపథ్యంలో యువత క్రికెట్ బెట్టింగ్ వ్యసనం గా మార్చుకొని బంగారు భవిష్యత్తు పాడు చేసుకోవద్దని యువతకు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు. బెట్టింగుల వల్ల నష్టపోవడమే తప్ప ఎవరు బాగుపడింది లేదని సూచించినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.