మార్కాపురం: బెస్తవారిపేటలో ఏబీఎం ఆస్తులను కాపాడాలని జిల్లా కలెక్టర్ కు విజయ సునీత కు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏబీఎం ఆస్తులను కాపాడాలని బేస్తవారిపేట తెలుగు బాప్టిస్ట్ సొసైటీ మాజీ ఎడ్యుకేషనల్ బోర్డు మెంబర్ దానమయ్య జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీఎం కు సంబంధించిన సుమారు 28 ఎకరాల భూమి ఇతరులు ఆక్రమించుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్నారు. అందులో పాఠశాలకు సంబంధించిన రెండు ఎకరాలు ఆక్రమించుకోవడంతో ఎంతోమంది ఎస్సీ బీసీ ఎస్టీ విద్యార్థులు విద్యను పొందలేకపోతున్నారన్నారు. ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని తమ స్థలాలను తమకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు