తాడిపత్రి: 80 శాతం మంది ప్రజలు పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు: తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిలో 80 శాతం మంది ప్రజలు పరిశ్రమలు పై ఆధారపడి జీవిస్తున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తన స్వగృహంలో గురువారం ఆయన మాట్లాడారు. తమ హయాంలో అనేక పరిశ్రమలను తాడిపత్రికి తీసుకువచ్చామన్నారు. పెన్నా సిమెంట్, ఎల్ అండ్ టీ, ఆర్జాస్ వంటి అనేక పరిశ్రమలను తీసుకువచ్చామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి అన్ని రకాల సహకరించామన్నారు. అయితే ప్రస్తుతం కొందరు పరిశ్రమల వల్ల వాతావరణం కాలుష్యం అవుతున్నదని పరిశ్రమలను దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. ఇన్నాళ్లు లేని పొల్యూషన్ ఇప్పుడు మాత్రమే వచ్చిందని ప్రశ్నించారు. పరిశ్రమల జోలికి రావద్దన్నారు.