దర్శి: దర్శి ఎస్సీ కాలనీలో సైకిల్ పై పర్యటన చేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
Darsi, Prakasam | May 18, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సైకిల్ పై ఎస్సీ కాలనీలో పర్యటించారు. ఇంధనం పొదుపు చేయాలని సీఎం చంద్రబాబు చెప్పడంతో పలువురు ఆయన బాటలోనే పయనిస్తున్నారు. తన వాహనాలను పక్కనపెట్టి టిడిపి కార్యాలయం నుంచి కాలనీ వరకు సైకిల్ పై ప్రయాణం చేశారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.