గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
180 కోట్ల రూపాయల ఖర్చుతో గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటున్న ప్రజల శాశ్వత నీటి సమస్య పరిష్కరించ బోతున్నామని మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. మార్కెట్ యాడ్ సమీపంలో నూతన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.56 లక్షలతో నూతన సిసి రోడ్లు నిర్మిస్తున్నామని ఇప్పటివరకు గిద్దలూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 24 కోట్లు ఖర్చు చేసినట్లు అన్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాచర్ల రైల్వే గేటు వద్ద వందకోట్లతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్నామని అలానే డ్రైనేజీ కాలువలు నిర్మిస్తామని తెలిపారు.