రాయదుర్గం: రక్తదానం చేయడం అభినందనీయం : జిల్లా కలెక్టర్ ఆనంద్
రక్తదానం చేయడం ద్వారా ఒకప్రాణాన్ని కాపాడినవారమవుతారని రక్తదానం ప్రాణ దానంతో సమానమని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. ఆపద సమయాల్లో చికిత్స పొందుతున్న వారికి రక్తం ఎంతో అవసరం ఉంటుందన్నారు. దాతలు స్వచ్చందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల పిహెచ్సి లో వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏపియూడబ్లూజె ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాతలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని నిర్వాహకులకు సూచించారు. డిఎంహెచ్ఓ ఈ భ్రమరాంబికా దేవి పాల్గొన్నారు.