కనిగిరి: పట్టణంలో 43 మంది లబ్ధిదారులకు రూ.23,64,277లు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు శుక్రవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ.22,64,277 లు విలువచేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు కనిగిరి నియోజకవర్గంలో రూ .6.50 కోట్లు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశామన్నారు. అర్హత ఉన్న లబ్ధిదారులు తన కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వారందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.