రాయదుర్గం: మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండండి : రాయదుర్గం ఎక్సైజ్ ఇనిస్పెక్టర్ మహేష్ కుమార్
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ వారోత్సవాల సందర్భంగా గురువారం రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ అధికారులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు, NCC క్యాడెట్లు, విద్యార్థులందరూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాయదుర్గం ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబంలో సమాజంలో ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుందని వివరించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనం గడపాలని, వ్యసనానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.