యర్రగొండపాలెం: తన పొలాన్ని ఇతరుల ఆక్రమించారని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేసిన బాధితురాలు
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దోర్నాల మండలం ఎగువ చర్లపల్లి గ్రామానికి చెందిన హుస్సేనమ్మ తన పొలాన్ని ఇతరుల ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీ వారిచ్చిన మూడు ఎకరాల పొలమును 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ హాస్పటల్లో ఉన్నప్పుడు పొలాన్ని వేరే వాళ్ళ ఆక్రమించుకున్నారన్నారు. తిరిగి వచ్చి ఇదెక్కడి న్యాయమని అడుగుతే మాపై దౌర్జన్యం చేస్తున్నారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అయితే మాకు న్యాయం జరగలేదు అన్నారు.