రాయదుర్గం: పట్టణంలోని లక్ష్మీబజార్ లో రోడ్డు ప్రమాదం, తీవ్రంగా గాయపడిన మహిళ
రాయదుర్గం పట్టణంలోని లక్ష్మీబజార్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ తీవ్రంగా గాయపడింది. గురువారం ఉదయం గొల్లపల్లి వైపు నుంచి బైక్ పై సబ్ మర్సిబుల్ మోటారు బాడీ తీసుకుని వస్తుండగా జారిపడి నడుచుకుంటూ వెళుతున్న వేపరాళ్ల గ్రామానికి చెందిన అనసూయమ్మ కాలుపై పడింది. ఈ ప్రమాదంలో ఆమె కాలుకు తీవ్రంగా గయాలుకాగా స్థానికులు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.