గిద్దలూరు: గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో గొర్రెల సంతను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
గొర్రెల కాపరులకు మేలు చేసేందుకే గొర్రెల సంత ప్రారంభించినట్లు మార్కాపురం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. బుధవారం మార్కెట్ యాడ్ ఆవరణలో నిర్వహించిన గొర్రెల సంతను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రతి శుక్రవారం గిద్దలూరు మార్కెట్ యాడ్ ఆవరణలో పశువుల సంత ఇప్పటికే నిర్వహిస్తున్నామని ఇప్పుడు ప్రతి బుధవారం మేకలు, గొర్రెల సంత నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గొర్రెల కాపర్లు సంత కోసం మార్కాపురం ప్రాంతానికి వెళ్లవలసిన పరిస్థితి గతంలో ఉండేదని వారి ఇబ్బందులను దృష్టిలో గొర్రెల సంత ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.